రెండో రోజు ఫోన్‌లు అందజేసిన చేసిన పోలీసులు
ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు 'మీ మొబైల్ – మీ ఇంటికి' సేవ కార్యక్రమం రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను పోలీసులు వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేస్తున్నారు. ప్రజల కమ్యూనికేషన్ అవసరాలు, భద్రత కోసం పోలీస్ శాఖ ఈ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోందని ఎస్పీ తెలిపారు. ఈ సేవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.