ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు: కమిషనర్
NLR: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా 33 ప్రధాన ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ నందన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలంతా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించి, అవసరమైన సమయాల్లో మాత్రమే బహిరంగ ప్రదేశాలలో తిరగాలన్నారు. అత్యవసర సమయాల్లో నిర్దేశించిన రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.