ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని విద్యార్థికి గాయాలు

ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని విద్యార్థికి గాయాలు

CTR: పుంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లు హైస్కూల్ వద్ద మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొనడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన విద్యార్థిని పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.