నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని పెద్దిపాలెం ఫీడర్ పరిధిలో కొత్త లైన్లు వేసే పనులు, మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ వీరభద్రరావు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్దిపాలెం, కిత్తమూరిపేట, రౌతుపాలెం, వేములపాలెం, ఇ. గోకవరం, మెట్టుచింత, ఉలిగోగుల, ధారపల్లి, ఎరకంపాలెం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలివేస్తున్నట్లు పేర్కొన్నారు.