'వచ్చే ఏడాది నాటికి 4,000 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం'

BHNG: యాదాద్రి పవర్ స్టేషన్‌ను వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో మంత్రుల బృందం ఆదివారం పర్యటించింది. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం చేసే కార్యక్రమం విజయవంతమైందని భట్టి విక్రమార్క తెలిపారు.