ఇజ్రాయెల్ దెబ్బకు గజగజ వణుకుతున్న లెబనాన్

ఇజ్రాయెల్ దెబ్బకు గజగజ వణుకుతున్న లెబనాన్

ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో లెబానాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. గతవారం చేసిన దాడుల్లో 83 మంది పిల్లలు మృతిచెందగా 200 మందికి పైగా గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూనిసెఫ్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గజగజ వణికిపోతున్న లెబనాన్‌కు ఆర్థికసాయం అందించేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది.