'ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు'
PDPL: ఓదెల మండలం రూపు నారాయణపేటలో శుక్రవారం గ్రామస్తులు పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో, బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలతో ఆలయం వద్దకు చేరుకొని మొక్కులు సమర్పించారు. పిల్లలు, పెద్దలు వేడుకలో భాగంగా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమా, గ్రామస్తులు పాల్గొన్నారు.