'బడి పిలుస్తోంది' అమలుపై MLAతో చర్చించిన DEO
VZM: బడి పిలుస్తోంది కార్యక్రమం అమలుపై స్దానిక MLA అదితి గజపతిరాజుతో DEO మాణిక్కంనాయుడు గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రస్తుత పరిస్థితి, విద్యార్థుల హాజరు పెంపు, అవసరమైన సదుపాయాలపై చర్చించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి ప్రతి పిల్లవాడు ప్రభుత్వ బడిలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.