ట్రాఫిక్ చలాన్ల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్
AKP: జిల్లాలో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు, జిల్లా జడ్జి సూచనల మేరకు జరుగుతున్న ఈ లోక్ అదాలత్‌లో వాహనదారులు పెండింగ్ ట్రాఫిక్ ఈ-చలాన్లను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. దీర్ఘకాలంగా ఉన్న చలాన్ల క్లియరెన్స్‌కు ఇది మంచి అవకాశం అని తెలిపారు.