రైతులకు అందుబాటులో ఆర్డీఎస్ విత్తనాలు

రైతులకు అందుబాటులో ఆర్డీఎస్ విత్తనాలు

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి రైతు సేవ కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఆర్డీఎస్ విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లచ్చన్న మాట్లాడుతూ.. రైతులు రాబోయే రబీ సీజన్‌లో మినుము పెసర, బొబ్బర పంటలకు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇలాంటి పంటల వల్ల భూసారం పెరిగి అధిక ఉత్పత్తి లభిస్తుందని తెలిపారు.