చింతలపూడిలో రూ.8.5 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు

చింతలపూడిలో రూ.8.5 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు

ELR: చింతలపూడి మార్కెట్ కమిటీ జిల్లాలో రూ.8.5 కోట్లు మార్కెట్ ఫీజు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. సోమవారం ఏఎంసీ ఛైర్ పర్సన్ దుర్గా పార్వతి మధు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో చింతలపూడి నిలవాలని ఆ విధంగా పాలకవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు.