గుత్తిలో గ్యాస్ సిలిండర్ల కోసం పడిగాపులు

గుత్తిలో గ్యాస్ సిలిండర్ల కోసం పడిగాపులు

ATP: గుత్తిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకే గ్యాస్ ఏజెన్సీ వద్దకు సుమారు 400 మంది ఖాళీ గ్యాస్ సిలిండర్లతో క్యూ లైన్‌లో నిలబడ్డారు. మరోపక్క గ్యాస్ ఏజెన్సీలు తలుపులు తెరవకపోవడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడుతున్నారు. గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.