వారు జైలుకెళ్లక తప్పదు: భానుప్రకాష్ రెడ్డి

వారు జైలుకెళ్లక తప్పదు: భానుప్రకాష్ రెడ్డి

AP: పరకామణి అంశంలో దోషులు జైలుకెళ్లక తప్పదని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. 'దొంగను దాతగా చేశారు.. దొంగతనాన్ని కానుకగా మార్చారు. దొంగలను తీసుకెళ్లి లోకాయుక్తలో ఎలా రాజీ చేస్తారు?. శ్రీనివాసుడు ఉగ్రనరసింహుడు అయ్యాడు.. ఖజానాను దోచుకున్న వారిని శిక్షిస్తాడు. వడ్డికాసులవాడు వడ్డీతోపాటు అందరికీ చెల్లించే రోజులు దగర్లోనే ఉన్నాయి' అని పేర్కొన్నారు.