పర్యావరణ పరిరక్షణతోనే సంపూర్ణ ఆరోగ్యం
SRPT: పర్యావరణం బాగుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నూతనకల్ పీహెచ్‌సీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అడవుల నరికివేత వల్ల కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని, వన్యప్రాణులను కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతిని ప్రేమిస్తూ, కాలుష్యాన్ని నియంత్రించి 'సమగ్ర ఆరోగ్యం' దిశగా అడుగులు వేయాలన్నారు.