VIDEO: వెంకన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
ELR: జంగారెడ్డిగూడెంలోని శ్రీ గోకుల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.