అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన

అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన

మాకవరపాలెం మండలం భీమ బోయినపాలెం గ్రామంలో కేజీబీవీ బాలికల కళాశాల అదనపు భవనాల నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. కోటి 68 లక్షలతో అదనపు తరగతి భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబాయ్ ప్రత్యేక అధికారి త్రివేణి, సర్పంచ్ నందకిషోర్ పాల్గొన్నారు.