VIDEO: మొక్కజొన్న పంటను తొక్కేసిన అడవి పందులు

KMR: గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలో శుక్రవారం రాత్రి అడవి పందులు రైతులకు చెందిన సుమారు 5 ఎకరాల మొక్కజొన్న పంటను నాశనం చేశాయి. ఉమ్మెడ బోజారావు, నదిపొల్ల బలవంతరావు అనే రైతుల పంట పూర్తిగా ధ్వంసమైంది. పంట నష్టాన్ని అంచనా వేసి, తమను ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరారు.