జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ముమ్మర తనిఖీలు
ATP: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్ళు, రహదారులు, శివారు ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించే వాహనాలను నిలిపివేసి, జరిమానాలు విధిస్తూ ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.