పడగల్‌లో ఆటోమేటిక్ సెన్సార్ ఏర్పాటు
NZB: వేల్పూర్ మండలంలోని పడగల్‌లో వీధి దీపాల కోసం ఆటోమెటిక్ సెన్సార్ విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా సూర్యాస్తమయం కాగానే లైట్లు వెలుగుతాయని, ఉదయాన్నే వాటంతట అవే ఆగిపోతాయని సర్పంచ్ నల్ల రాజు తెలిపారు. దీనివల్ల విద్యుత్ ఆదా కావడంతో పాటు పంచాయతీకి బిల్లుల భారం తగ్గుతుందన్నారు. ఈ వినూత్న ప్రయత్నంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.