జిల్లాలో సన్న బియ్యం, చేతి సంచులు పంపిణీ

BHPL: జిల్లాలో సెప్టెంబర్ నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యంతో పాటు చేతి సంచులను పంపిణీ చేయనున్నారు. 'అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం' నినాదంతో సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటోలతో సంచులపై ముద్రించారు. జిల్లాకు 1,23,733 సంచులు వచ్చినట్లు సివిల్ సప్లై అధికారి ఇవాళ రాములు తెలిపారు. ప్రతి రేషన్ కార్డుకు ఒక సంచి అందజేస్తారని పేర్కొన్నారు.