VIDEO: యూరియా కోసం జాతీయ రహదారిపై ఆందోళన

VIDEO: యూరియా కోసం జాతీయ రహదారిపై ఆందోళన

SRPT: మోతె మండలం మామిళ్లగూడెం జాతీయ రహదారిపై యూరియా కొరతను నిరసిస్తూ 10గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. కొన్ని రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో నిల్చున్నా, యూరియా బస్తాలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే యూరియాను అందించాలని కోరుతున్నారు.