'మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

CTR: సదుం, సోమల మండల సరిహద్దు గ్రామాలలో ఏనుగుల సంచరించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు శుక్రవారం సూచించారు. దామలచెరువు అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు నాయనవారి పల్లికి చేరుకున్నట్టు వారు తెలిపారు. బత్తలవారి పల్లి, పోతంవారి పల్లి, నల్లరాళ్ళ ఉప్పరపల్లి, సీలయ్యగారి పల్లి, గురకానివారి పల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.