గ్రామ సర్పంచ్‌గా పూణెం సంధ్యారాణి ఏకగ్రీవంగా ఎన్నిక
MHBD: గంగారం మండల (M)లోని దుబ్బగూడెంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పూణెం సంధ్యారాణి ఇవాళ గ్రామస్తులు తీర్మానంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.