డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి హానికరం: డీఎస్పీ

డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి హానికరం: డీఎస్పీ

కోనసీమ: మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితాలు సర్వనాశనం అవుతాయని రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య హెచ్చరించారు. మండపేట మండలం కేశవరంలో ఆమె మాదకద్రవ్యాల నివారణకై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని అన్నారు. విద్యార్థులు, గ్రామస్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.