నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
గుంటూరు ఎస్వీఎన్ కాలనీ రహదారి విస్తరణ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. హుస్సేన్ ఖాన్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్వీఎన్ కాలనీ, తారకరామనగర్ ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.