నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: సుభాష్
NLG: నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ జిల్లా నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని 20వ వార్డు పెద్ద బండలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. గత పదేళ్లలో KCR ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.