సమన్వయంతో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
VKB: కొడంగల్ పట్టణ అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శనివారం ఆర్&బీ గెస్ట్ హౌస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్విమ్మింగ్ పూల్, డిగ్రీ కళాశాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో జాప్యం వద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.