చికిత్స పొందుతూ యువకుడు మృతి

AKP: చీడికాడ మండలం సిరిజం గ్రామానికి చెందిన సాయి గిరీష్(28) విశాఖ నుంచి ఆరిలోవ బైక్‌పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. బైక్‌పై వెళుతున్న సాయి యూటర్న్ తీసుకుంటుండగా మరో బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తండ్రి లక్ష్మీనారాయణ తెలిపారు.