పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: నాగోల్ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివారు ప్రాంతంలో డ్రైనేజీ, మంచినీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.