తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణం జరిగింది. గజ పటాన్ని స్వరకవచ ధ్వజస్తంభం పైకి ఎగురవేసి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. ముందుగా అమ్మవారి ఉత్సవర్లను ధ్వజస్తంభానికి అభిముఖంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు.