కాంగ్రెస్ పార్టీలో చేరిన రెబల్ అగ్గి ప్రసాద్ గౌడ్
RR: నందిగామ మండల కేంద్రం 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అగ్గి ప్రసాద్ గౌడ్ విజయం సాధించారు. ఎన్నికలకు ముందు కాగ్రెస్ పార్టీ పెద్దల మద్దతు కోరినప్పటికీ, గ్రామ నాయకులు మరో సీనియర్ నేతకు మద్దతు ఇచ్చారు. దీంతో రెబల్‌గా బరిలో దిగిన అగ్గి ప్రసాద్ గౌడ్ గెలుపొందారు. అనంతరం సర్పంచ్ కొమ్ము కృష్ణతో కలిసి ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.