సహాయక వంట మనిషి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
NLG: మిర్యాలగూడ మండలం తుంగపాడు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో సహాయక వంట మనిషి పోస్టుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంఈవో బాలూనాయక్ ఇవాళ తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణత ఉన్న 45 ఏళ్లలోపు మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి గౌరవ వేతనంగా రూ.6,500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు.