రాజవొమ్మంగిలో పారిశుద్ధ్యంపై శిక్షణ
ASR: రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 18న పారిశుద్ధ్యంపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో యాదగిరేశ్వరావు సోమవారం తెలిపారు. మండలంలో అందరు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.