అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం: ఎమ్మెల్యే

MBNR: పట్టణంలోని 15వ వార్డులోని సైడ్ డ్రైనేజీల కోసం రూ. 13 లక్షలతో నిర్మించనున్న పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ లతా శ్రీ లక్ష్మణ్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.