జిల్లాలో అకాల వర్షానికి రూ. 65 లక్షల పంట నష్టం

జిల్లాలో అకాల వర్షానికి రూ. 65 లక్షల పంట నష్టం

ATP: అకాల వర్షానికి అనంతపురం, తాడిపత్రి, గుమ్మఘట్ట, గుంతకల్లు మండలాల్లో 16 మంది రైతులకు చెందిన 11.70 హెక్టార్లలో అరటి దెబ్బతింది. రూ. 48.60 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే గార్లదిన్నె మండలంలో 38 మంది రైతులకు వరి పంటలో రూ. 15.50 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.