VIDEO: కొమురవెల్లి మల్లన్న ఆదాయం ఎంతంటే
SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. గత 13 రోజులకు గాను రూ.60,82,771 నగదు వచ్చినట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. నగదుతో పాటు 36 గ్రాముల బంగారం, 2.9 కిలోల వెండి, 127 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.