సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన
VZM: డెంకాడ మండలం అమకం గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య వాతావరణం ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే, డ్రైనేజ్ వ్యవస్థ బలంగా ఉంటే గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.