'జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి'
KMR: జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి చేస్తున్నట్టు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయి పూర్వ ప్రాథమిక బోధకుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 70 పాఠశాలలో ఈ సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యను అధికారికంగా ప్రారంభించడం జరిగిందనన్నారు.