'విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం'

PDPL: అనుకోని ఘటనలు ఏమైనా జరిగినట్లయితే వాటిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని వేళలా సన్నద్ధంగా ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ ఎన్టీపీసీలోని పవర్ ప్లాంట్‌లో భద్రత సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు.