గురుకుల విద్యార్థుల క్లీన్ స్వీప్
SRPT: ఇంటర్ ఫలితాల్లో నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీవాణి తెలిపారు. మొదటి సంవత్సరంలో 78 మందికి 78 మంది, రెండో సంవత్సరంలో 79 మందికి 79 మంది విద్యార్థినులు పాసై రికార్డు సృష్టించారు.