బాధితులకు ఉద్యోగాలిచ్చే అంశం పరిశీలించండి: సుప్రీం

బాధితులకు ఉద్యోగాలిచ్చే అంశం పరిశీలించండి: సుప్రీం

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్ దాడి బాధితులకు సంబంధించి రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఆర్థిక సాయం అందించేందుకు పాలసీని సిద్ధం చేయాలని తెలిపింది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో బాధితుల జీవనాధారం కోసం భత్యం చెల్లించేలా విధానాలు రూపొందించాలని సూచించింది.