'ఈ - శ్రమ్‌లో కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలి'

'ఈ - శ్రమ్‌లో కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలి'

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన అవగాహన సదస్సులో, అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ.. ఈ - శ్రమ్ పోర్టల్లో నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వం అందించే వివిధ సామాజిక భద్రత పథకాలు పొందాలన్నారు. డిసెంబర్ 3 వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో కార్మికుల కోసం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు.