మాంసం దుకాణాల మూసివేత

మాంసం దుకాణాల మూసివేత

విజయనగరం: శివరాత్రి సందర్భంగా మాంసం విక్రయాలు నిషేధమని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు 50వ వార్డు మాధవధారలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ చిరంజీవి, సిబ్బంది కలిసి మాంసం దుకాణాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఒక దుకాణం తెరిచి ఉండడం గమనించి మూసివేయించారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.