పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
NZB: డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో పాఠశాలలోని స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కోడి గుడ్లు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.