బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం ఆంకుంటలో మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో శిశు సంక్షేమ శాఖ, ష్యూర్ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. బాల్య వివాహ చట్టం, దాని వల్ల కలిగే నష్టాలు, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లు 1098, 181, 100 గురించి తెలియజేశారు.