రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుక్కల మధు (35)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.