సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: 'ఆది లోనే హంస పాదు'
అర్థం: ఏదైనా ఒక పనిని ప్రారంభించిన వెంటనే అడ్డంకులు ఎదురవ్వడం లేదా మొదట్లోనే ఆటంకం కలగడాన్ని ఈ సామెతతో పోలుస్తారు. పూర్వం తాటాకులపై రాసేటప్పుడు మొదటి అక్షరం దగ్గరే పొరపాటు దొర్లితే ఇలా అనేవారు. అంటే ఒక శుభకార్యం లేదా కొత్త పని మొదలవగానే విఘాతం కలిగితే ఈ సామెతను వాడుతారు. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలడాన్ని ఇది సూచిస్తుంది.