'డీప్ ఫేక్'పై చిరంజీవి స్పందన
డీప్ ఫేక్ వీడియోలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. టెక్నాలజీని ఆహ్వానించాలి కానీ, దాని వల్ల ముప్పు కూడా ఉందని హెచ్చరించారు. డీప్ ఫేక్‌ల కట్టడికి ప్రభుత్వాలు వెంటనే చట్టాలు తీసుకురావాలని కోరారు. తాను ఫిర్యాదు చేసిన డీప్ ఫేక్ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పోలీస్ వ్యవస్థ బలంగా ఉందని చిరంజీవి భరోసా ఇచ్చారు.