పుణ్యపురం సర్పంచ్ అభ్యర్థి మరియమ్మ ఏకగ్రీవం

పుణ్యపురం సర్పంచ్ అభ్యర్థి మరియమ్మ ఏకగ్రీవం

KMM: వైరా మండలంలోని 22 గ్రామపంచాయతీలకు గాను పుణ్యపురం గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ అయింది. గడువు ముగిసే నాటికి కాంగ్రెస్ నాయకురాలు యంగల మరియమ్మ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైనట్లయింది. ఇక ఎనిమిది వార్డులకు కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైనట్లు తెలిసింది. ఈమేరకు మరియమ్మను నాయకులు అభినందించారు.