సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ప్రచారం.!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సరికొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. సాంప్రదాయ ప్రచారానికి భిన్నంగా, సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ పాటలను ప్రత్యేకంగా రాయించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల 'నయా ' ప్రచారానికి సోషల్ మీడియా వేదికైంది.